నిష్కళంక భక్తి తత్వం - అచ్చంగా తెలుగు

నిష్కళంక భక్తి తత్వం

Share This

నిష్కళంక భక్తి తత్వం

సి.హెచ్.ప్రతాప్

 



భగవద్గీత 8 వ అధ్యాయం, 14 వ శ్లోకం  

అనన్యచేత: సతతం యో మాం స్మరతి నిత్య: |
తస్యాహం సులభం: పార్థ నిత్యయుక్తస్య యోగిన:  

ఓ అర్జునా  ఎల్లప్పుడూ నష్కళంత , నిస్వార్ధ మరియు అనన్య భక్తితో నన్ను గురించి ఆలోచించే యోగులకు, వారు నిరంతరం నాలో నిమగ్నమై ఉండటం వలన నేను సులభంగా పొందగలను అని భగవంతుడు అర్జునుడిని నిమిత్తం చేసుకొని తన చరణాలను పొందెందుకు ఒక అద్భుతమైన సాధనామార్గాన్ని తెలియజేసాడు. శ్రీ కృష్ణుడు భక్తుడు అచంచల విశ్వాసం, పవిత్రమైన హృదయం, తనను చేరాలన్న తపన , తోచన వుంటే అనన్య బ్జక్తితో తనను సులభంగా పొందగలడని చెబుతున్నాడు  కానీ ఇది అనన్యచేతాః అంటే వారి మనస్సు పూర్తిగా భగవంతునిలోనే నిమగ్నమై ఉన్న సాధకులకు మాత్రమే వర్తిస్తుంది.. అ-నాన్య అనే పదానికి శబ్దవ్యుత్పత్తి పరంగా న అన్య లేదా "వేరేది కాదు" అని అర్థం  . అందువల్ల, భగవంతుడిని పొందడానికి అనన్య భక్తి ముందస్తు షరతు. కాలక్షేపం కోసమో లేక హంగు ఆర్భాటంతో పది మంద్ది ముందు తన దర్పం, అధికారం ప్రదర్సించుకునే ఆర్భాటకులకు మాత్రం భగవంతుడిని చేరడం అసాధ్యం.నిష్కళంక భక్తి అంటే, మనసులో ఎలాంటి మాలిన్యం, కోరికలు లేకుండా, కేవలం దైవానికి మాత్రమే సమర్పించే భక్తి. అంటే, స్వచ్ఛమైన, నిర్మలమైన భక్తి అని అర్థం. నిష్కళంక భక్తిలో ఎలాంటి స్వార్ధభావన లేకుండా, ఎలాంటి ఆశయాలు లేకుండా భగవంతునిపై ఉంచే ప్రేమ మాత్రమే వుంటుంది. ఇది సాధకుల  హృదయాన్ని పవిత్రం చేస్తుంది. భగవంతుడిని సంపూర్ణంగా అర్పించుకునే భక్తుడికి ఎలాంటి భయాలు ఉండవు. నిర్భయంగా జీవితం జడుపుతాడు. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ, మన భారతీయ సంస్కృతిలోనూ అనేక నిష్కళంక భక్తుల కథలు ఉన్నాయి. మీరాబాయి, భక్త ప్రహ్లాదుడు, భక్త మార్కండేయుడు, త్యాగరాజస్వామి వంటి మహనీయులు నిష్కళంక భక్తికి అనువైన ఉదాహరణలు. వారు భగవంతునిపై అసలైన ప్రేమతో భగవంతుని కోసమే జీవించారు.నిష్కళంక భక్తి మనిషిని పరిపూర్ణమైన ఆనందానికి, భగవంతుని చేరువకు తీసుకువెళ్తుంది. ఎలాంటి స్వార్ధం లేకుండా, భగవంతునిపై భక్తి ఉంచినపుడు నిజమైన ఆధ్యాత్మికత లభిస్తుంది. మనలో ఈ నిష్కళంక భక్తిని పెంపొందించుకుంటే, నిజమైన భక్తులుగా మారగలుగుతాం.నిష్కళంక భక్తి ఉన్నచోటే నిజమైన ఆనందం ఉంది అంటుంది శాస్త్రం.

భక్తి గురించి మనం మరింత తెలుసుకునే కొద్దీ, అనన్యత, నిష్కమత మరియు నిరంతర అనే మూడు ప్రమాణాలు పదే పదే ఉద్భవిస్తూనే ఉంటాయి. స్పష్టంగా, కృష్ణుడి పట్ల మనకున్న ప్రేమను పరిపూర్ణం చేసుకోవాలంటే అవి చాలా ముఖ్యమైనవి అని శాస్త్రం చెబుతోంది.

అన్ని శాస్త్రాలు, మతాలు, వివిధ మత గ్రంధాలు కూడా  అనన్య భక్తి పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి."నన్ను మాత్రమే ప్రేమించు, నన్ను మాత్రమే ప్రేమించు" అని భగవంతుడు చెబుతున్నాడు. మనం ఆయనను మాత్రమే ప్రేమించాలంటే, మనతో సహా ఏదైనా లేదా ఏదైనా భౌతికం పట్ల ప్రేమ ఉండకూడదు. మన ఏకైక కోరిక భగవంతుడిని పొందదమే కావాలి. ఇందుకు అనన్య భక్తి సాధన ఉపకరిస్తుంది.
స్వార్థపరుల ద్వేషపూరిత హృదయాలలో శాంతి రాజ్యమేలదు. సహనం, పట్టుదల మరియు సహనంతో ఆధ్యాత్మికత యొక్క పవిత్ర మార్గాన్ని అనుసరించే వారు మాత్రమే అనన్య భక్తిని సాధించేందుకు అర్హులు. అనన్య భక్తి అనేది దేవుని పట్ల ఏకాభిప్రాయ భక్తి, ఇందులో పూర్తి శరణాగతి ఉంటుంది. ఒకరు తన మనస్సును ముక్కలు చేయకూడదు మరియు దానిలో ఒక భాగాన్ని మాత్రమే దేవునికి అర్పించకూడదు. మనస్సు పూర్తిగా భగవంతుని ఆరాధనలో, చింతనలో మునిగిపోవాలి. దైవం తప్ప మరే ఇతరమైన దానిని కోరకూడని స్థితి కలగాలి.

***

No comments:

Post a Comment

Pages