శివం - 121
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
నేను అనగా శివుడు..
వరద అనగా విష్ణువు
(కార్తికేయుడు నేను విష్ణుమూర్తి ని కలిసి నంది మీద బృందిమీద అధిరోహించి బయలుదేరబోతున్నాము)
నంది బృంగి దళాలలో ఉన్న గణ అనే ఎద్దు ను కార్తికేయనుకి వాహనముగా చేశాము
గణ కార్తికేయని ఎక్కించుకోవటానికి మెడ కొంచం పక్కన ఉంచి నా మీద కూడా మీ ఇద్దరు అధిరోహించండి ప్రభు అన్నట్లు నా వైపు విష్ణువు వైపు చూస్తుంది.
నంది బృంగి నన్ను విష్ణుమూర్తిని తమ మీదకి అధిరోహింపజేసి ఎవరు పరిగెడతారు తొందరగా అన్నట్లు పందెం వేసుకుంటున్నాయి
వరద " ఏం బావ బృంగి దూకుతున్నాడు "
నేను " నంది మాత్రమే తక్కువ "
కార్తికేయుడు " రాజాల్లారా ! గురువుల్లారా మీ ఇద్దరి సరసం మామూలుగా లేదే అడుగడుగునా ఏదో ఒకటి అనుకుంటే మరొకటి సరదాగా చేస్తూనే ఉన్నారు "
నేను " అదే ! మాతో పాటు మరొక ఆయన కూడా కలుస్తాడు లే చూద్దువు గాని "
వరద " ఎవరు బావ మన పంకజ రాజాన "
బ్రహ్మదేవుడు ఇది చూసి నన్ను కూడా ప్రస్తావిస్తున్నారు అని నవ్వుకుంటున్నాడు..
సరస్వతీ మాత " నాదా ! మీకు పంకజబవడని మరొక పేరు కాదు కదా దాన్ని పంకజ రాజా చేశారు "
అందరూ సరదాగా నవ్వుకున్నారు
పార్వతీ మాత " బాగుంది ! నటరాజ వరదరాజ పంకజరాజా "
లక్ష్మి మాత " మన పేర్లైనా మనమే పెట్టుకుందాము నేను లక్ష్మక్క .. నువ్వు విశాలి అక్క.. సరస్వతి మాత మాత్రం వాణి అక్క "
ఇది తెలుసుకున్న మన వరదరాజ నటరాజ బాగున్నాయి పేర్లని నవ్వుకున్నారు ..
కా " పంకజ రాజా కూడా ఇక్కడికే వస్తారా లేక మనం వెళ్లి అక్కడ కలుసుకోవాలా? "
వరద " ఎమో దర్శక ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఆయన ఎక్కడ కనబడదల్చుకుంటే మనకి అక్కడ కనబడతాడు , ఇదిగో మీ గురువు ఈ నటరాజ బావ ఆయన్ని ఎక్కడికి పడితే అక్కడకెళ్ళవాకని నిషేధించాడు"
ఆంజనేయుడు " బ్రహ్మదేవా ! తమరికి ఆ రోజు పూజలు చేయకూడదు అని జరిగిన శాపాన్ని .. మహాదేవుడు కృష్ణుడు వలె చిలిపిగా చెబుతున్నాడు "
బ్రహ్మః దేవ " అంతే కదా భవిష్యత్తు బ్రహ్మదేవా ఆంజనేయ"
కా " అదేమిటి గురవా నువ్వే విరాగిలాగా బైరాగిలాగా తిరుగుతావు అంటున్నావు మరి ఆయన్ని ఎందుకు అలా చేశావు "
నేను " నేనేం చేశా నాయనా .. ఇక్కడ ఏదైనా సృష్టించేది ఆయనే.. కాపాడేది ఈ వరదరాజ బావ, అంతా అయిపోయాక లయ0 చేసేది నేను "
కా " బాగుంది బ్రహ్మదేవుడు సృష్టి చేసినట్టు.. విష్ణుమూర్తి ఉద్ధరించినట్టు.. మహాదేవుడు లయన్ చేసినట్టు బాధ్యతలు భలే ఉంచుకున్నారు "
నేను " అంతేగా మరి"
కా " ఇక నువ్వేం చెప్పొద్దులే.. నాకు అర్థమైందిలే ఎట్లాగో లయమ్మ్చేయాల్సింది నీవే కాబట్టి సరదాగా అటు ఇటు తిరిగి ఆ సమయానికి వచ్చి నీ పని నువ్వు చేసుకుంటావు "
వరద " దర్శకుడికి అంతా అర్థమైందే! మాములు వాడు కాదు " అని భేషుగ్గా తల ఊపారు
నేను " మనిషి సృజనాత్మకత కలిగిన వ్యక్తి కదా వెంటనే పట్టేస్తాడు.. అసలు తెలుసుకున్న రోజు హరసిద్ధుని వలే మారిపోతాడేమో "
వరద " ఎందుకు బావ ఆ మాటలు పాపం ఆ హారసిద్ధుడికి లేనిపోని అవమానాలు కలిగింపజేసి చివరికి ఒక దారిని చేర్చావు. .. అసలే నాటకం అన్న కళ లన్నా బహు కష్టము ఆ కష్టం చాలక ఇతగాడిని ఎందుకు హారసిద్ధుడితో పోలుస్తావు. ఇతగాడి కథలో వ్యాకులతో వద్దు ఉండవలసినదన్త ఆనందము దానివల్ల వచ్చే అంతరార్థము "
నేను " అంతేలే బావ ! "
కా " ఏమిటి పెద్ద గురువా చిన్న గురువా ! మీలో మీరే మాట్లాడుకుంటున్నారు "
నేను " ఏదో సరదాగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాం లే"
కా " మొత్తానికి మీ పాడి ని చూపించారు.. మీకు ఇన్ని ఎద్దులు ఇన్ని ఆవులు ఉన్నాయి.. మీ పశువులు కూడా మీరంటే ఎంత అభిమానం కనపరుస్తున్నాయి.
మీ ముగ్గురు రాజాల ఉమ్మడి వ్యాపారం ఏమిటో".
వరద " తినబోతూ రుచి ఎందుకు అడుగుతావు దర్శక మెరు"
కా " ఏమి తినబోతూ వరదరాజ.. ఆకలి ఆకలి అన్నా మా గురువు నన్ను పట్టించుకోవట్లేదు "
నేను " అదేమిటయ్యా కార్తికేయ నీకు మంచి భోజనం పెట్టిద్దామనే కదా నా సంకల్పం"
కా "సంకల్పమే కాదు గురువా సంకల్ప సిద్ది కూడా కలిగించు "
నేను - వరద " తధాస్తు "
వరద " సరేగాని దర్శక మా బావకి బాల రాముడి కథ బాల ఆంజనేయుడు కథ చెప్పావు .. నాకేమన్నా చిన్న కథ ఒకటి చెప్తావా "
నేను " ఎందుకు చెప్పడు చెబుతాడు నీకు మాత్రం ఏం పని నేను కూడా ఆ కథ వింటాను.. ఏమి.. ఒకరికి చెప్తే ఏమీ ఇద్దరికీ చెప్తే ఏమీ" అంటూ విష్ణు మీదకి సరదాగా వాదనకు దిగాను
వరద " ఓ బావ ! నువ్వు మీ దర్శకుడు నా మీద ఒంటికాలతో లేస్తారు ఏమిటి "
కా " శివ శివ గురువా! నేను నీ మీదకి లేవటమేమిటి మీ ఇద్దరూ నాకు ఒకటే "
వరద - నేను " హా హా హా "
కా "ఇప్పుడు ఇంతకీ తరువాత ఘట్టం ఏమిటో చెబితే కనీసం ఆకలి ఆపుకొని ఓపిక పట్టుకొని కూర్చుంటాను"
అంటూ గట్టి నిట్టూర్పు విడిచాడు
నేను " మా ముగ్గురి పరివారం అంతా అక్కడే ఉంటారు అక్కడ నీకు వెళ్ళగానే మంచి భోజనం ఏర్పాటు చేస్తాం కొద్దిగా సేద తీరిన తర్వాత సరదాగా మాట్లాడుకుందాం "
కా " గురువా కొన్ని గంటల నుంచి అదే చెప్తున్నావు "
నేను మరియు విష్ణువు మనసులో . మీ త్రిమాతలతో
" మనం అనుకున్న విధంగా చేయబోతున్నాం "
అనగానే మీ త్రిమాతలు బ్రహ్మదేవుడు అందరికీ తమ ఏం చేయాలో అర్థం అయింది
నేను " ఇప్పుడు ఆ పచ్చిక బయలు కనపడుతున్నాయి కదా ఇందులో నుంచి కొన్ని క్రోసులు లోపలికి వెళ్ళగానే అక్కడ ఉండేదంతా మన క్షేత్రమే .. అక్కడే మా పరివారము అక్కడే మా సమస్తము ఉన్నాయి పద వెళదాం గణ "
నంది బృంగితోపాటు గణ కూడా వేగంగా కదిలాయి
మేము ముగ్గురం ఆ ప్రత్యేక ఏపుగా పెరిగిన పచ్చికల్లోకి దూసుకుపోతున్నాం
కా " గురువా అద్భుతం నేను ఎద్దెక్కినట్టు లేదు గుర్రం ఎక్కినట్టుంది "
వరద " మా ప్రియతమ దర్శకుడివి నువ్వు ఆ మాత్రం ఆనందపట్టమే మాకు కావలసినది "
నేను "మును ముందంతా ఆనందమే కార్తికేయ "
త్రిమాతలు "తధాస్తు".
***
No comments:
Post a Comment