ఇల మహారాజు వృత్తాంతము
అంబడిపూడి శ్యామసుందర రావు
శ్రీరామ చంద్రుడు అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనకా తానూ అరణ్య వాసంలో మునుల ద్వారా విన్న ఎందరో మహానుభావుల గాధలను తన తమ్ముళ్లకు వినిపిస్తాడు వాటిలో తన వంశ పూర్వికులు, కొంతమంది మునులు వారు సాధించిన ఎన్నో బృహత్కార్యములు వివరిస్తాడు అటువంటి గాధలలో ఇల మహారాజు వృత్తాంతము ఒకటి ఈ విధంగా శ్రీరాముడు విన్న గాధలు తమ్ముళ్లకు చెప్పిన గాథలు ఉత్తర రామాయణములో మనకు కనిపిస్తాయి ప్రస్తుతం ఇల మహారాజు వృత్తాంతము తెలుసుకుందాం
ధర్మ నిరతుడు,శుభ లక్షణుడు, యశస్వి ,మహావీరుడు అయిన ఇలుడు బాహ్లిక దేశానికి ప్రభువు. ఆయన కర్దమ ప్రజాపతి కుమారుడు.ఇల మహారాజు వృత్తాంతములో శాపవశాత్తూ కొంత కాలం స్త్రీగా కొంతకాలము పురుషుడిగా ఉండడం ప్రత్యేకత. రాజు ఎందుకు స్త్రీ గా మారేడో మళ్లి పురుషుడిగా ఎలా మారెడో తెలుసుకుందాము. ఇల మహారాజు తన పరివారంతో అరణ్యానికి వేటకు వెళ్ళి వివిధ మృగాలను వేటాడుచు కుమారస్వామి జన్మించిన ప్రదేశానికి వెళ్ళాడు.ఆ సమయానికి అక్కడ శివుడు పార్వతితో కలసి ఆమె కోరిక మేరకు శివుడు స్త్రీ రూపము దాల్చి సెలయేరులలో విహరించు చుండెను.. అప్పుడు అక్కడే ఉన్న పురుష లక్షణాలు ఉన్న జంతువులు అన్ని జీవ రాశులు, ఆ ప్రాంతానికి వచ్చిన రాజు అయన పరివారం అందరూ స్త్రీలుగా మారిపోయారు. ఇల మహారాజు ఈ మార్పు పరమేశ్వరుని ప్రభావం అని గ్రహించి ఆయనను శరణుజొచ్చారు పార్వతి సమేతుడైన శివుడు ఇల మహారాజుతో, "రాజా నీకు తిరిగి పురుష రూపం ఇవ్వలేను గానీ మరేదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను"అని చెపుతాడు. రాజు మరె ఇతర వరం కోరుకొనుటకు ఇష్టపడక పార్వతీ దేవిని శరణు జొచ్చెను పార్వతి దేవి కనికరించి," రాజా నీవు స్త్రీ పురుష రూపాలలో ఏదైనా ఒక రూపాన్ని కోరుకో నేను దానిలో సగం మాత్రమే ఇవ్వగలను"అని చెప్పింది.
రాజు దేవి మాటలు విని," దేవి నాయందు దయ ఉంచి ఒక మాసము స్త్రీ రూపం లోను మరొక మాసం పురుష రూపంలో ఉండునట్లు అనుగ్రహించమని వేడుకొనెను.పార్వతి దేవి అనుగ్రహించి ,"రాజా నీవు కోరినట్లే అగును కానీ స్త్రీ రూపంలో ఉన్నప్పుడు ఆ రూపంతో చేసిన పనులేవీ తరువాత పురుష రూపంలో మారినప్పుడు జ్ఞప్తికి రావు అదే విధముగా పురుష రూపంలో ఉన్నప్పుడు చేసిన పనులేవీ స్త్రీ రూపం లోకి మారినప్పుడు జ్ఞప్తికి రావు"అని చెప్పగా రాజు కొంత ఊరట చెందెను.
పార్వతి దేవి అనుగ్రహం వల్ల రాజు ఇళ అనే పేరుతొ అతని అనుచరులు స్త్రీ రూపం పొంది స్త్రీలు గా వ్యవహరించుచు ఆ విహరిస్తూ ఉంటారు ఆ వనములో కొద్ది దూరంలో గల సరస్సు తీరమున చంద్రుని కుమారుడైన బుధుడు ఆ సరస్సులో ఉండి తీవ్రమైన తపస్సును ఆచరించుండెను. అదే సమయంలో సరస్సులో స్త్రీ రూపము
ఇళాదేవి బుధుని తో కూడి ఆ మాసం అంతా దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడిపి మాసం పూర్తి అయిన వెంటనే ఇళా దేవి ఇల గా మారి మేల్కొనెను. మహారాజుగా మారిన ఇళా దేవి కి గత మాసంలో జరిగిన విషయాలు ఏవి గుర్తు ఉండవు కాబట్టి తపము ఆచరిస్తున్న బుధుని దగ్గరకు వెళ్లి ,"మహానుభావా నాపేరు ఇల మహరాజును నాపరివారముతో ఈ ప్రాంతానికి వచ్చాను కానీ నా పరివారము ఎవరూ కనిపించడం లేదు వారి జాడ మీరు చెప్పగలరా?"అని అర్ధించెను అప్పుడు బుధుడు ,"మహారాజా నీ అనుచరులు అందరు ఇటీవల కురిసిన వడగండ్ల వానకు హతులైనారు నీవు మాత్రం నా ఆశ్రమములో ఉండటం వలన రక్షింపబడ్డావు"అని చెప్పగా విన్న ఇల మహారాజు తన అనుచరుల మృతికి బాధపడి తన రాజ్యానికి వెళ్ళటానికి బుధుని అనుమతి కోరాడు.కానీ బుధుడు ఇల మహారాజును ఒక ఏడాది పాటు తన ఆశ్రమం లోనే ఉండమని అందువల్ల రాజుకు మంచి జరుగుతుంది అని ఒప్పించి రాజు అక్కడే ఉండేటట్లు చూసాడు.
ఆ ఏడాది కాలంలో ఇల మహారాజు స్త్రీ ఉన్నప్పుడు బుధుని భార్యగా పురుష రూపంలో ఉన్నప్పుడు రాజుగా ఉంటూ ధర్మ నిరతుడు గా ఉండేవాడు.బుధుని భార్యగా ఉన్నప్పుడు వారిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు అతనే పురూరవుడు సంవత్సర కాలం గడిచిన పిమ్మట ఇల పురుషుడుగా ఉన్న మాసమున బుధుడు సంవర్త రాజర్షిని, చ్యవనుని, అరిష్టనేమిని, దూర్వాసుడు , ప్రమోదనుడు మొదలైన ఋషులను పిలిచి "మహాత్ములారా ఇతను కర్దమ ప్రజాపతి కుమారుడైన ఇల మహారాజు ఇతని పూర్వ పర వృత్తాంతాలను మీరు ఎరుగుదురు ఈయనకి మంచి జరిగే ఉపాయమును తెలుపండి " అని ప్రార్ధించెను అదే సమయములో కర్దమ ప్రజాపతి కొంతమంది బ్రాహ్మణోత్తములతో అచటికి వచ్చెను, కర్దముడు ,"బ్రాహ్మణోత్తములారా ఇల మహరాజు
బుధుని ఆశ్రమానికి సమీపాన వారందరు అశ్వమేధ యాగాన్ని నిర్వహించారు సంతుష్టు
***
No comments:
Post a Comment